మీ పిల్లలకు ఆస్తిపాస్తులిస్తే చాలానుకుంటున్నారా?

Share this Page

 తండ్రి ఎప్పుడు బిడ్డలు సుఖసంతోషాలనే కోరుకుంటాడు. వారి భవిష్యత్ గురించే నిరంతరం పరితపిస్తుంటాడు. బిడ్డల జీవితాలు బాగుండాలని తాను ఏ మార్గాన నడిచాడో… ఏ మార్గంలోని సంకటాలను అధిగమించి… తాను చూసిన వెలుగునీడలే సాక్షిగా తన బిడ్డలు జీవితంలో అత్యున్నత శిఖరాలు చేరుకోవాలని కోరుకుంటాడు.

కాలంతోపాటు ప్రతి ప్రయాణంలోనూ మార్పులు తప్పవు. కొత్త పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది? గత అనుభవాలు…  ప్రస్తుతం ఎలా ఉపయోగపడతాయన్నది ఎంతో కీలకం. పిల్లలకు తల్లిదండ్రుల నుంచి అన్ని వారసత్వంగా వచ్చేస్తాయా? మనసులోని సమతుల్యాన్ని ఈశ్వరుడు అందిస్తే… సంతానానికి సంస్కారం నేర్పించేది వారి తల్లిదండ్రులే…  తండ్రి నడిచిన మార్గంలో సంతానం నడిస్తే… వారి జీవితం సుఖమయమవుతుందా?  

జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలు.. సవాళ్లతో ప్రయోజనం లేదా… ?    ప్రతి కొత్త ప్రశ్న, కొత్త సమాధానాన్ని రాబడుతుంది. ప్రశ్నలు, సంఘర్షణలు, సవాళ్లకు సంతానాన్ని దూరంగా ఉంచితే అది వారికి మేలు చేసినట్టా…? హాని చేసినట్టా? సంతానం భవిష్యత్ ను నిర్మించడానికి బదులుగా…  వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడమన్నదే తల్లిదండ్రుల కర్తవ్యమని తెలుసుకోవాలి. సంతానం భవిష్యత్ పలానా విధంగా ఉండాలని నిశ్చయించడానికి బదులుగా వారు కొత్త కొత్త సంఘర్షణలు ఎదుర్కోడానికి తగినంత విజ్ఞత, సమయస్ఫూర్తి, ధైర్యాన్ని అందించడం గొప్ప తల్లిదండ్రులు చేయాల్సిన పని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *