పిల్లల్ని మీరు ఎందుకు కన్నారు..!?

Share this Page

బిడ్డల జీవితాల్లో సుఖసంతోషాలు నింపే ప్రయత్నం చేయడమే తల్లిదండ్రుల  కర్తవ్యం. ఎవరి కారణంగా జన్మలభిస్తుందో… వారి కర్మ ఫలితం ఆధారంగా… భవిష్యత్ తరాలకు మీరెవరన్నది తెలుస్తుంది. అందుకే వారి సుఖసంతోషాల గురించి ప్రణాళికలు వేయడం కంటే… ఉత్తమమైనది ఏదీ ఉండదు. కర్మ ఫలితం ఆధారంగానే… సుఖం, భద్రత లభిస్తాయి. తల్లిదండ్రులు అందించిన మంచి  లేదా చెడు సంస్కారం… ఉపయోగకరమైన లేదా నిరుపయోగకరమైన శిక్షణ మాత్రమే బిడ్డలకు ప్రాప్తిస్తుంది.  

సంస్కారం, శిక్షణలతోనే మనిషి వ్యక్తిత్వం రూపుదాల్చుకుంటుంది. సంతానం వ్యక్తిత్వాన్ని తల్లిదండ్రులు ఎలా మలచుతారో… అలాంటి భవిష్యత్తే వారికి లభిస్తుంది.  కానీ చాలా మంది తల్లిదండ్రులు  సంతానానికి… భవిష్యత్ లో భద్రతను చేకూర్చాలన్న తపనతో వారి వ్యక్తిత్వ వికాస బాధ్యతను మరచిపోతుంటారు. సంతానం భవిష్యత్తు మాత్రమే బాగుంటే చాలని తపించడం వల్ల ఉపయోగం ఏముంటుంది? సంతానాన్ని ప్రేమించే తల్లిదండ్రులు… భవిష్యత్‎కు కాక… వారి వ్యక్తిత్వానికి పునాదులు వేస్తే… వారికి సమాజం నుంచి ప్రశంసలు, కీర్తి లభిస్తాయి. అందుకే మీ పిల్లలకు చేపలు పట్టి ఇవ్వడం కంటే… చేపలు  ఎలా పట్టాలో నేర్పిస్తే వారు సమాజాన్ని ప్రభావితం చేసే గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు.           ఆదర్శప్రాయులుగా నిలుస్తూ సమాజంలో తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పేరు నిలబెడతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *