కరోనా సంక్షోభం వేళ ఐక్యరాజ్యసమితి అసలు ఎక్కడుంది?

Share this Page

కరోనా వైరస్ ప్రమాదం నుంచి ప్రపంచదేశాలను బయటపడేసేందుకు భారత్ ఎంతగానో శ్రమిస్తుందన్నారు ప్రధాని మోదీ… ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన మోదీ… యూఎన్ అసలు పనిచేస్తుందా అంటూ ప్రశ్నించారు. సమితి ఏర్పడిన నాటి నుంచి సభ్యదేశంగా ఉన్నా… ఇప్పటికీ సంస్కరణల ఫలాలను భారత్ అందుకోలేకపోవడం దారుణమన్నారు. మూడో ప్రపంచ యుద్ధం జరక్కుండా అడ్డుకోగలిగాం… కానీ ప్రచ్ఛన్నయుద్ధాలు జరక్కుండా మాత్రం చేయలేకపోయాం. తీవ్రవాదుల దాడుల్లో రక్తం ఏరులైపారుతోంది. ఎంతో మంది దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది జీవితాలు కోల్పోయారు. ఎనిమిది, తొమ్మిది నెలలుగా కరోనాపై ప్రపంచ దేశాలు పోరాటం చేస్తుంటే… ఐక్యరాజ్యసమితి అసలు ఎక్కడుంది? ఐక్యరాజ్యసమితిని భారత్ ఎంతో గొప్పగా గౌరవిస్తోంది. మరి అదే పని ఐక్యరాజ్యసమితి కూడా చేయాలి కదా… ఐక్యరాజ్యసమితి శాశ్వతసభ్య దేశంగా భారత్ ఎప్పుడు స్థానం సంపాదించుకుంటుందో చెప్పాలి? బలహీనంగా ఉన్నప్పుడు భారత్ ఎవరికీ భారం కాలేదని… బలపడే కొద్దీ ఎవరికీ భారత్ బరువు కాలేదన్నారు మోదీ. ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి శాంతి దళంలో భారత్ సైన్యాన్ని పంపిస్తూనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వసుధైక కుటుంబమన్న స్ఫూర్తితో వ్యవహరించే భారతీయులు… ప్రపంచ సంక్షేమాన్ని, సౌభ్రాతృత్వాదేన్ని కాంక్షిస్తుందన్నారు. ఐరాసలో ప్రపంచమంతా మంచి కోసం భారతదేశం ఎప్పుడూ నొక్కి చెబుతుంది. భారతదేశం అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని ప్రారంభించింది. యోగాను భారతదేశం ఇచ్చింది. ప్రపంచ సంక్షేమం గురించి భారతదేశం ఎప్పుడూ ఆలోచించింది. కరోనావైరస్ మహమ్మారి సమయంలో 150 కి పైగా దేశాలకు భారతీయ ఔషధాలు వైద్య సామాగ్రిని పంపించాయి. భారతదేశ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రపంచాన్ని మహమ్మారి నుండి బయటకు తీసుకురావడానికి సహాయపడుతుంది. క్లినికల్ ట్రయల్స్ 3 వ దశ వైపు వెళ్తున్నాం. త్వరలోనే టీకా సిద్ధమవుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *