పులి, సింహం నుంచి మనిషి ఏం నేర్చుకోవాలి
అడవికి రాజు, రాణి గా చలామణి అవుతున్న క్రూరమృగాలు అయినా పులి సింహాల నుంచి మనిషి ఏమి నేర్చుకోవాలి? అవి మనిషికి ఇచ్చే సందేశం ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోండి. నాకు అనిపించిన భావన మీతో వ్యక్తపరచాలి అని అనుకుంటున్నాను. ఓ మనిషి నాకు ఆకలి వేసే సమయంలో తప్ప నేను వేటాడడం చెయ్యను, ఎవరి జోలికి వెళ్లను కానీ నీచమైన బుద్ధితో మానవత్వాన్ని మరిచి స్వార్ధం అనే ఆకలితో ప్రతిక్షణం మాటలు అనే పంజా విసిరి ఎదుటి వ్యక్తిపై నిందలు మోపి వారి మనసును విరిచే ప్రయత్నం చేస్తున్నావు. మృగాన్ని నేనే ధర్మానికి కట్టుబడి జీవిస్తున్నప్పుడు మరి నీవెందుకు అధర్మానికి ఒడిగడుతున్నావ్.
జంతువునైనా నాకన్నా దిగజారి మనిషిగా జన్మించి ఉన్న విలువను కోల్పోతున్నావ్. ఇది మనిషిగా జన్మించిన వారందరికీ వర్తిస్తుంది. దీనికి మనిషి ఏమి సమాధానం చెప్తారో అది వారి బుద్ధి ని బట్టి ఉంటుంది అని తెలుసుకోండి. దీన్ని బట్టి చూస్తే తన మానవత్వ విలువలను ఎంతగా మరిచిపోయాడు అర్థమవుతుంది. సతో (సత్యయుగం) ప్రధాన స్థితి నుంచి తమ ప్రధాన స్థితికి వచ్చేసాడు. అంటే నా ఆత్మలు ఉన్న ప్రేమ శాంతి సుఖము జ్ఞానము పవిత్రత ఆనందము శక్తి అయినా అనాది గుణాలను మరిచిపోయి వికారాలను మనలో నింపుకున్నామని అర్థం. సృష్టి రహస్యాన్ని మర్చిపోయి జన్మ చక్రాల కాలగమనంలో మరిచిపోయి నీచ స్థితిలో జీవిస్తున్నాను అని అర్థం.
ఇప్పుడు సమయం ఆసన్నమైంది మన ఆత్మలో పరివర్తన చేసుకుని ఆధ్యాత్మిక వైపు పరమాత్మ చెయ్యి పట్టుకుని తండ్రి జతలో మన ప్రతి అడుగు వేసుకుంటూ మన గమ్యం పరంధామమును చేరుకోవాలి. కలియుగ అంతిమలో ఉన్నాము అన్న విషయం అందరికీ తెలిసిందే. కలియుగము తరువాత సత్య యుగ స్థాపన జరగబోతున్నది. మన ఆత్మిక స్థితిని మనము పెంచుకోవాలి ఆత్మ అవినాశి. బిoదు స్వరూపము నేను ఎప్పుడైతే అనుభూతి చెందుతానో , నాకు తెలియకుండానే శాంతి స్థితిలోకి వెళ్ళిపోతాను. శాంతి పొందినప్పుడు మీ జీవితంలో వచ్చే మార్పులను మీరే గమనిoచుకోండి.
ఉషారాణి నేచురోపతి క్లినిక్ – హైదరాబాదు నుంచి డాక్టర్ రాధిక లేళ్ళ 7995937939 కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు.
