కుక్క మనకు ఏం నేర్పుతుంది?

Share this Page

మనం పెంపుడు జంతువుగా పెంచుకునే కుక్క నేర్పే తత్వమేంటి? ఓ మనిషి నీవు నాకు ఒక ముద్ద అన్నం పెడితే నా జీవిత కాలమంత సేవ చేయాలని భావిస్తాడు. తనకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ నీకు ఈ సృష్టిలో అదృష్టం కలిగించిన దేవునిపై విశ్వాసంతో… ఈ లోకంలో అప్పగించిన కార్యాన్ని చేస్తున్నావని గుర్తుంచుకోడు… ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలని మనకు కుక్క విశ్వాసపాత్రంగా వివరిస్తుంది. ఇక్కడ మనమందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. తత్వం గురించి మనం మాట్లాడుకోవాలి. పరమాత్మ మనకి జీవితాన్ని ఇచ్చారు. మనల్ని ఆయన పిల్లలుగా చేసుకుని వారసత్వంగా అష్టశక్తులు, దివ్యగుణాలు, 16 కళలు ఇచ్చారు. కానీ మన ఆత్మలో ఆ శక్తులన్నిటినీ కూడా కోల్పోయాం. ఇప్పుడు సతో ప్రధాన స్థితి నుంచి… వారి వారి ప్రధాన స్థితిలోని ఆత్మీయ స్థితిని తెలుసుకోవాలి. అందుకే మనం పరమాత్మ స్నేహ హస్తాన్ని పట్టుకుని… ఈ కలియుగంలో మనం కోల్పోయిన ఆత్మ అష్టశక్తులు, దివ్య గుణాలు, 16 కళలను మన పరం చేసుకోవాలి.

కాదు వాటినన్నిటినీ కూడా మన ఆత్మలో నింపుకోవాలి. తండ్రి వారసత్వాన్ని తీసుకోవాలి. పరమాత్మ మన నుంచి ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోవాలి. వికారి ఆత్మగా మారిపోయిన మనం మళ్ళీ తిరిగి సతో ప్రధాన స్థితిని పొందాలని కోరుకుంటున్నారు. మనలో ఉన్న వికారాలు ఏంటీ… కామము… మోహము… లోభము… అహంకారము, క్రోధము… వీటిన్నింటినీ మాయా జీత్‎లోకి వెళ్లి జయించాలి. సత్య యుగ స్థాపనకు మనమందరం సిద్ధం కావాలి. కానీ మనం ఏమి చేస్తున్నామన్న ప్రశ్న వేసుకుంటే మీకు సమాధానం దొరుకుతుంది.

ఉషా రాణి నేచురోపతి క్లినిక్ – Hyderabad
డాక్టర్ రాధిక
7995937939
www.usharaninaturopathyclinic.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *