సుఖాన్ని కోరుకోవడమా? ధర్మాన్ని ఆచరించడమా?

Share this Page

భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఏడు విధాలుగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. భవిష్యత్  సుఖంగా ఉండాలి. భవిష్యత్ సురక్షితం కావాలి… అందుకు అనుగుణంగా నిర్ణయాలను ఈ రోజే తీసుకుంటారు.  మీ జీవితాన్ని ఒకసారి చూసుకోండి… మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు భవిష్యత్ కోసం తీసుకున్నవే కదా!  

జీవితాన్ని సరళంగా… సుఖమయంగా మార్చుకునే ప్రయత్నం చేసే అధికారం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ భవిష్యత్ ఎవరికీ తెలియదు. కేవలం ఊహించుకోగలం అంతే.  జీవితంలోని అన్ని ముఖ్యమైన నిర్ణయాలు… మీ ఊహల ఆధారంగానే తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకోవడానికి ఏదైనా… ఇంకొక మార్గం లేదంటారా… ఆలోచంచండి. సకల సుఖాలకు ఆధారం ధర్మమే. ఆ ధర్మమే మనిషి హృదయంలో ఉంటుంది. అందుకే ప్రతి నిర్ణయానికి ముందు మనసులో ఈ ప్రశ్న వేసుకోండి. ఈ నిర్ణయం స్వార్థం నుంచి పుట్టిందా… ధర్మం నుంచా అని. రేపటి గురించి కాకుండా… ధర్మం గురించి ఆలోచిస్తే… భవిష్యత్ అధిక సుఖమయం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *