ప్రజలు ఎప్పుడో డిక్లేర్ చేశారు… మళ్లీ లొల్లేంటి?

Share this Page

ఏపీ రాజకీయాలు ఎప్పుడూ కూడా వాస్తవ దూరంగా సాగుతుంటాయ్. అవసరమైన విషయాలు సైడైపోతాయ్. అనవసర విషయాలు పతకా శీర్షికలైపోతాయ్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం వస్తే… ముందుగా ఆయన డిక్లరేషన్‎పై సంతకం చేయాలంటూ ఓ బ్యాచ్ తయారైపోయింది. అది కూడా అధికారంలో ఉన్నప్పుడు చూసీచూడనట్టుగా వ్యవహరించిన ఆ పెద్దలు ఇప్పుడు ఎందుకు డిక్లరేషన్‎పై సంతకం చేశాకే.. తిరుమలలో కాలు పెట్టాలంటూ యాగీ చేయడం విడ్డూరం కదా… అవును ఏపీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరి చాలా అసంబద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అంతకు ముందు ప్రతిపక్షనేత. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శికుంటే సకల పాపాలు తొలగి శుభాలు కలుగుతాయని ఎవరైనా విశ్వసిస్తారు. పనులు కావడం కోసం శ్రీవారిని మొక్కుకుంటారు. వేడుకుంటారు. అలాగే పాదయాత్ర ప్రారంభంలో శ్రీవారిని మెట్లపై వెళ్లి నడిచి దర్శించుకున్నారు జగన్. ఆ తర్వాత పాదయాత్ర ముగిశాక శ్రీవారిని దర్శించుకున్నారు.

అప్పుడు అవసరం లేదని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు? ముఖ్యమంత్రిగా నాడు పనిచేసిన చంద్రబాబునాయుడు… ఎందుకు ఈ విషయాన్ని ఇంతలా సాగిదిస్తున్నారు. పైపెచ్చు.. ఆయన తనయుడు. ఇంకా పార్టీ పెద్దలు అందరూ కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక్కటి చెప్పాలి. ముఖ్యమంత్రి పీఠం ఎవరికి పడితే వారికి దక్కదు. అందుకు కొన్ని లెక్కలుంటాయ్. కొన్ని సమీకరణాలుంటాయ్. జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నో కష్టాలు, నష్టాలు ఓర్చి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తను నమ్మిన సిద్ధాంతాల ప్రకారం పనిచేస్తున్నారు. ఇక కోవిద్ రివ్యూలో భాగంగా… ప్రధాని మోదీ ఓ ఇంటరెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. మీ వల్ల స్వామి వారిని దర్శించుకునే అవకాశం కలిగింది. అన్నమయ్య భవన్లో శ్రీవారి చిత్ర పటానికి నమస్కరించారు. కొన్ని అంతే అలా జరిగిపోతాయనుకోవాల్సిందే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *