జగన్ సర్కారుకు గుడ్ న్యూస్…

Share this Page

ఒకే రాజధాని ఉండాలని చట్టంలో ఎక్కడా లేదంటూ… ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంలో మొదట్నుంచి చెబుతున్నట్టుగానే కేంద్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. రాజధాని వ్యవహారం కేంద్రం పరిధిలోనేదేనని దీంట్లో కేంద్రం చేసేదేమీ లేదంటూ తేల్చింది. మూడు రాజధానుల వ్యతిరేక పిటిషన్లకు సంబంధించి… కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అందులో భాగంగా.. కేంద్ర హోం శాఖ తాజాగా అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. అందులో రాజధాని విషయంలో తమ జోక్యం ఉండదని కుండబద్ధలు కొట్టేసింది. అదే విధంగా రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని… సెక్షన్ 13 ప్రకారం రాజధాని ఒకటికే పరిమితం కావాలనే లేదంటు చెప్పుకొచ్చింది. 2018లో అప్పటి ప్రభుత్వం అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేసిందని నివేదించింది. హైకోర్టు ఉన్నంత మాత్రాన అమరావతినే రాజధాని అని చెప్పలేమంది. ఇప్పటి వరకు చెబుతున్న వాదనకు మద్దతుగానే మరోసారి.. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని కేంద్రం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‎లో కోర్టుకు నివేదించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *