ప్రధాని కార్యాలయంలోకి ఆమ్రాపాలి

Share this Page

యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారి అమ్రాపాలి కాటా ఇకపై ప్రధాని కార్యాలయంలో పనిచేయనున్నారు. ప్రస్తుతం డిప్యూటేషన్ పై కేంద్ర కేబినెట్లో పనిచేస్తున్న ఆమ్రాపాలి పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆమెతోపాటు మరో ఇద్దరు యువ ఐఏఎస్ అధికారులకు పీఎంవోలో నియమితులయ్యారు. ప్రభుత్వం ఏదైనా… ఆమ్రాపాలి మాత్రం వందకు వంద శాతం మార్కులతో సత్తా చాటారు. ఏ పదవికైనా వన్నె తెచ్చే శైలి ఆమెది. 2010 ఏపీ బ్యాచ్ కు ఎంపికైనా ఆమ్రాపాలి… వికారాబాద్ సబ్ కలెక్టర్ గా… ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్ జిల్లా కలెక్టర్ గా, రాష్ట్రత ఎన్నికల సంఘం లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మొత్తంగా ఇప్పుడు ఆమ్రాపాలి కొత్త ఇన్నింగ్స్ తో దేశ వ్యాప్తంగా పరిచయం కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *