దివికేగిన గానగంధర్వుడు

Share this Page

ఏం చెప్పాలి… ఏం రాయాలి… గానగంధర్వుడు మన జీవితాలను ప్రతి నిమిషం ప్రభావితం చేస్తూనే ఉన్నారు. ఆయన పాట వింటూనే పెరిగిన జనం… ఆయన పాడుతుంటేనే పరవశించిన జనం మనం. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఏ ప్రాంతానికో పరిమితమైన గాయకుడు కాదు.. దేశం మొత్తం కీర్తించే ఘనాపాటి. ఏ పాటనైనా అలవోకగా పాడుతూ తెలుగుజాతికి లభించిన అణిముత్యంగా ఆయనను కొలుస్తున్నాం. 74 ఏళ్ల వయసులో ఎస్పీ కన్నుమూశారు. దాదాపు రెండు నెలలుగా చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందిన బాలు… కరోనాను జయించారు కానీ… మృత్యువు ఆడిన ఆటలో దివికేగారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతితో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. త్వరలోనే ఆరోగ్యంగా బయటకు వస్తారనుకుంటున్న తరుణంలో ఇలా జరగడంతో అభిమానులతోపాటు, సినీ జనం కూడా కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ఈనెల 22న ఎస్పీబీ తనయుడు… తన తండ్రి ఆసుపత్రి నుంచి బయటకు రావాలని తపించారని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆ వార్తతో ఎస్పీబీ త్వరలోనే కోలుకుంటారని అందరూ భావించారు. కానీ ఇంతలోనే ఇలాంటి విషాదం వినాల్సి వచ్చింది. ఎస్పీ 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. పద్మభూషన్ అవార్డు అందుకున్నారు. ఈటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పాడుతాతీయగా కార్యక్రమం ద్వారా వందల మంది గాయకుల్ని పరిచయం చేశారు. కేవలం పాట కాదు.. మాట… సంగీతం, నిర్మాతగానూ ఆయన కీర్తి అజరామరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *