చేసిన తప్పులకు దండన తప్పక లభించాల్సిందేనా?

Share this Page

ఎవరికైనా అపరాధానికి దండన లభిస్తే… అలాంటప్పుడు అది అన్యాయమని ఆ వ్యక్తి మనసు రోధిస్తుంది. అపరాధం చేసినప్పుడు తన ఆలోచనలు భిన్నంగా ఉండేవని చెప్పే ప్రయత్నం చేస్తారు. అపరాధం జరిగాకా… ఆ వ్యక్తి దానికి పశ్చాత్తాపం చెందుతాడు. తన ఆలోచనల్లో పరివర్తన వచ్చిందని… దండన ఎందుకు లభిస్తుందని బాధపడతాడు. నిజానికి… ఒక చర్య జరిగిందంటే దానికి… ప్రతి చర్య కూడా అనివార్యం.

కర్మానుసారమే ఫలితం ఉంటుంది. ఇంకొకరికి ప్రేమ పంచితే… సుఖం ప్రాప్తిస్తుంది. ఇంకొకరిని హత్య చేస్తే మృత్యుదండడన లభిస్తుంది. చేసిన కార్యాన్ని బట్టే న్యాయం కూడా అమలవుతుంది. అయితే ప్రయశ్చిత్తానికి, పశ్చాత్తాపానికి విలువే తప్పక ఉంటుంది. ప్రయశ్చిత్తం, పశ్చాత్తాపం వలన మనిషికి ఆత్మబలం పెరుగుతుంది. రానున్న దండనను స్వీకరించడానికి మనిషి మనసును సిద్ధం అవుతుంది. అయితే ప్రాయశ్చిత్తం లేకుండా మనిషి దండనను స్వీకరించడంలో ఫలితం ఉంటుందా…?

సమాజంలో ఇప్పుడు చాలా మంది తమకు లభించిన దండన పట్ల ఎంత మాత్రం కూడా సానుకూలత వ్యక్తం చేయడం లేదు. పైపెచ్చు… పలానా అంశంలో తాము దోషిగా ఎందుకు పట్టుబడ్డామా…  అని ఫీల్ అవుతున్నారే తప్పించి… తాము చేసింది తప్పని… అలా ఎందుకు చేశామని ఏ కోశానా కూడా బాధపడటం లేదు.  అలాంటి వారి జీవితాలు కట్టె కాలే వరకు ఏదో సంఘర్షణను ఎదుర్కొంటూనే ఉంటాయ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *