డాక్టర్ రెడ్డి ల్యాబ్‌కు రష్యా వ్యాక్సిన్

Share this Page

క్లినికల్ ట్రయల్స్, వ్యాక్సిన్ పంపిణీకి రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ RDIF అంగీకారం తెలిపిందని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌ పేర్కొంది. భారతదేశంలో 30 కోట్ల మోతాదుల వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి RDIF ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశంలోని అగ్రశ్రేణి ఔషధ సంస్థలలో ఒకటైన డాక్టర్ రెడ్డిస్ భారతదేశంలో టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తుందని, నియంత్రణ ఆమోదం పెండింగ్‌లో ఉందని RDIF ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశానికి రష్యా స్పత్నిక్ వి వ్యాక్సిన్ డెలివరీ ఈ ఏడాది చివరిలోగా ప్రారంభమవుతాయని, అదే సమయంలో ట్రయల్స్ పూర్తి కావడానికి… స్థానిక అనుమతులను బట్టి నిర్ణయమవుతుందని కంపెనీ పేర్కొంది. ఫేజ్ I, II ట్రయల్స్ అనుకున్న విధంగా ఫలితమిచ్చాయని… డాక్టర్ రెడ్డిస్ కో-చైర్మన్ జి వి ప్రసాద్ చెప్పినట్టుగా ఆర్డిఐఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. “స్పుత్నిక్ వి వ్యాక్సిన్ భారతదేశంలో COVID-19 కి వ్యతిరేకంగా మా పోరాటంలో నమ్మదగిన ఎంపికని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. టీకా ధర గురించి ఎలాంటి వివరాలు లేవని… RDIF ఇంతకుముందు లాభాలను ఆర్జించడమే కాదు, ఖర్చులను మాత్రమే వసూలు చేస్తూ వస్తోంది. టీకాను వృద్ధులు, అధిక ప్రమాదం ఉన్న కార్యాలయాల్లోని ప్రజలకు అత్యవసర పంపిణీ చేయడానికి పరిశీలిస్తున్నామని ప్రసాద్ చెప్పారు. RDIF ఇప్పటికే కజకిస్తాన్, బ్రెజిల్ మరియు మెక్సికోలతో వ్యాక్సిన్ సరఫరాకు ఒప్పందాలు చేసుకుంది. సౌదీ కెమికల్ సంస్థతో ఒక మెమోరాండంపై సంతకం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *