రాహుల్ దెబ్బ… కోహ్లీ బ్యాచ్ ఠా…

Share this Page

ఐపీఎల్ 13లో ఆసక్తికర ఘట్టాలకు తెరలేస్తోంది. మరీ ఉత్సాహంగా మ్యాచ్ లు జరగాల్సి ఉండగా… అంతలోనే మ్యాచ్ ఆగమాగం అయిపోతున్నాయ్. జట్టు అంతగా ఆడదనుకున్న టైమ్ లో ప్లేయర్లు దుమ్మురేపేస్తున్నారు. బాగా ఇరగదీస్తారనుకున్న సమయంలో పూర్తిగా వదిలేస్తున్నారు. ఇలాంటి సిట్యూవేషన్ నిన్న ఐపీఎల్ మ్యాచ్ లో సాక్షాత్కరించింది. దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ సేన చతికలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 206 పరుగులు చేయగా… బెంగళూరు 139కే ఆలౌట్ అయిపోయింది. అంతనే హేమీహామీలందరూ నేలకరిస్తే… పంజాబ్ కెప్టెన్ రాహుల్ హీరో ఇన్నింగ్స్ తో సత్తా చాటాడు. కేవలం 69 బంతుల్లో 132 పరుగులు చేశాడు. ఏడు సిక్సర్లు, 14 ఫోర్లతో బెంగళూరు బౌలర్లను ఊచకోతకోశాడు. ఇక కరేబియన్ బౌలర్ కాట్రెల్ వరుసగా రెండు వికెట్లు తీయడంతో కోహ్లీ సేన చేతులెత్తేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *