ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ తిరిగి ప్రారంభం

Share this Page

ఆస్ట్రాజెనెకా బుధవారం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో పాటు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ప్రయోగాలు నిలిపివేసినట్టు ప్రకటించింది. ఐతే… ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా శనివారం, కోవిడ్ -19 వ్యాక్సిన్ ట్రయల్ ను బ్రిటిష్ రెగ్యులేటర్ల నుండి అనుమతి పొంది మళ్లీ ప్రారంభించినట్టు వెల్లడించింది. “ఆస్ట్రాజెనెకా ఆక్స్ఫర్డ్ కరోనావైరస్ వ్యాక్సిన్, AZD1222 కొరకు క్లినికల్ ట్రయల్స్ UK లో తిరిగి ప్రారంభమయ్యాయి, మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (MHRA) ధృవీకరించడం తరువాత అది సురక్షితం అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గత బుధవారం ఆక్స్ఫర్డ్ టీకాతో ఓ వాలంటీర్ సమస్య ఎదుర్కోవడంతో వ్యాక్సిన్ ప్రయోగాన్ని నిలిపేసినట్టు సంస్థ ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా… అనేక మందికి ఆందోళన కలిగించింది. ప్రయోగంలో సమస్యతో టీకా భద్రతను సమీక్షించడానికి ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేశారు.


అయితే ఎలాంటి సమస్యలు లేవని ధ్రువీకరించాక… UK లో ట్రయల్స్ తిరిగి ప్రారంభించడం సురక్షితం అని MHRA కి సిఫారసు చేసినట్టు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా యొక్క టీకా ప్రయోగాలు ప్రస్తుతం చివరి దశలో ఉంది. ప్రయోగం విజయవంతమవుతుందన్న ధీమాతో అమెరికాలో ఆగస్టు 31 న డజన్ల కొద్దీ సైట్లలో 30,000 మంది వాలంటీర్లను టీకా పరీక్షకు స్వచ్ఛందంగా నమోదు చేయించుకున్నారు. ప్రస్తుతం టీకాను బ్రెజిల్, దక్షిణ అమెరికాలో కొన్ని సమూహాలపై పరీక్షిస్తున్నారు.


AZD1222 వ్యాక్సిన్ కోవిడ్ -19 కరోనావైరస్ కణాలపై దాడి చేయడానికి ఉపయోగించే స్పైక్ ప్రోటీన్ కోసం కోడ్ చేయడానికి ఇంజనీరింగ్ చేయబడిన సాధారణ జలుబు కలిగించే అడెనోవైరస్ ను టీకా బలహీనపరుస్తుంది. టీకాలు వేసిన తరువాత, ఈ ప్రోటీన్ మానవ శరీరం లోపల ఉత్పత్తి అవుతుంది, ఇది వ్యక్తికి తరువాత సోకినట్లయితే కరోనావైరస్ దాడిని తిప్పికొడుతుంది. “ట్రయల్ పార్టిసిపెంట్స్ భద్రత… క్లినికల్ ట్రయల్స్‌లో అత్యున్నత ప్రవర్తన ప్రమాణాలకు ఆస్ట్రాజెనెకా కట్టుబడి ఉందంటూ కంపెనీ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయో త్వరలోనే కంపెనీ మార్గనిర్దేశం చేస్తుందని తెలిపింది. మహమ్మారి సమయంలో వ్యాక్సిన్‌ను విస్తృతంగా, సమానంగా.. లాభాపేక్ష లేకుండా అందరికీ అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *