నమస్తే ధోనీ సార్… ఆర్సీబీ.. చెన్నై మ్యాచ్‎లో అసలేం జరిగిందంటే…

Share this Page

విజయాలకు చిరునామాగా మారిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కు తొలిసారిగా ఝలక్ పడింది. అంచనాలు లేకుండా రంగంలోకి దిగిన రాజస్థాన్ చేతిలో చెన్నై చిత్తూగా ఓడింది. తొలిత టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంచుకొని తప్పు చేశాడు ధోనీ. 217 పరుగులు లక్ష్యాన్ని చేధించే క్రమంలో ధోనీ సేన 200 పరుగుల వద్ద ఆగిపోయింది. డుప్లెసిస్ 36 బంతుల్లోనే 72 పరుగులు చేసినా… జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఇక డుప్లెసిస్ ఒకే ఇన్నింగ్స్ లో ఆరు సిక్సర్లో విరుచుకుపడ్డాడు. ఇక అంతకు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టులో సంజూ శాంసన్ చెలరేగి ఆడాడు. 32 బంతుల్లోనే 74 పరుగులు చేశాడు. తొమ్మిది సిక్సర్లు కొట్టి హీరో అన్పించుకున్నాడు. చివర్లో అర్చర్ 8 బంతుల్లోనే 27 పరుగులు చేయడంతో జట్టు భారీ స్కోరు సాధించింది. మొత్తంగా ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ సరిగా చేయలేదంటూ సీనియర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఐతే మ్యాచ్ లో ప్రత్యేకత ఏంటంటే… రాజస్థాన్ జట్టు నుంచి అరంగేట్రం చేసిన యశశ్వి… నమస్తే ధోనీ సాబ్ అంటూ చేసిన నమస్కారం హాట్ టాపిగ్గా మారింది. క్రికెట్ మగధీరుడు ధోనీ కన్పిస్తే సలామ్ చేయకుండా ఎవరుండారు. అందుకే యశశ్వి… తన చిరకాల అనుభూతిని ధోని కన్పించినప్పుడు చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *