ఎవరి ప్రాణాలు వారే కాపాడుకోండి… మోదీ నెమలితో బిజీగా ఉన్నారు

Share this Page

ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ… దేశ ప్రజలంతా కరోనాతో పోరాటం చేస్తుంటే… ఎలాంటి ప్రణాళిక లేకుండా ప్రజల ప్రాణాలతో మోదీ చెలగాటమాడారన్నారు. అదే సమయంలో ప్రధాని మోదీ నెమలితో ఆడుకోవడంలో బిజీగా ఉన్నారంటూ దెప్పిపొడిచారు. ప్రభుత్వం ప్రణాళిక లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల కరోనాతో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని… లాక్డౌన్ వల్ల ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడం వల్ల కరోనావైరస్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, లక్షలాది మంది నిరుద్యోగులయ్యారన్నారు. మహమ్మారిని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న రాహుల్ గాంధీ… ప్రధాని మోదీ మాత్రం నెమలితో బిజీగా ఉన్నారని… ఎవరి ప్రాణాలను వారే కాపాడుకోవాలన్నారు. దేశంలో కేసులు 50 లక్షల చేరవవుతుంటే… యాక్టివ్ కేసుల సంఖ్య 10 లక్షలుగా ఉందని… మోదీ ఆత్మనిర్భర్ నినాదం ప్రకారం ఎవరి ప్రాణాలను వారే కాపాడుకోవాలని… ఎందుకంటే మోదీ నెమలితో బీజీగా గడుపుతున్నారంటూ సెటైర్ వేశారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తరుణంలో రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీకి వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లారు. ఐతే రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలకు చేయాల్సింది ఏమీ లేకపోవడంతో… రాహుల్ గాంధీ రోజూ ట్వీట్లు చేస్తున్నారని…. విమర్శించారు. అదే సమయంలో ఒకరి తర్వాత మరొకరిని పార్టీ కోల్పోతుందన్నారు ప్రకాశ్ జావదేకర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *