మంత్రి వెల్లంపల్లికి ఏపీలో ఉండే అర్హత లేదు

Share this Page

రాష్ట్రం లో దేవాలయాలపై నిరంతరం దాడులు జరగడం సిగ్గు చేటన్నారు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి. దేవాలయాలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా భక్తులపై చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. అంతర్వేదిలో రథం దగ్ధం చేసిన వారిని పట్టుకోకుండా భక్తులను విచారణకు పిలవాలని కోర్టులో పిటిషన్ వేస్తారా అంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదే సమయంలో జైల్లో పెట్టిన మహిళా భక్తులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తొంభై శాతం ఉన్న హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతింటే ప్రభుత్వం చీమకుట్టినట్టు వివరిస్తుందంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువులు ఒక రకంగా ఇతర మతాలను ఓకరకంగా చూస్తున్నారని విమర్శించారు. ఇంటి ముందున్న దేవాలయాన్ని రక్షించుకోలేని మంత్రి వెల్లంపల్లి… రాష్ట్రంలో దేవాలయాలను ఎలా రక్షిస్తారంటూ ప్రశ్నించారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్‎కు ఆంధ్రప్రదేశ్‎లో ఉండే అధికారం లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *