మహాసుదర్శన కాడ… మహాద్భుతం

Share this Page

కరోనా తర్వాత ప్రపంచం మొత్తం గందరగోళంలో పడిపోయింది. వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఒక్కొక్క మెడిసిన్ వస్తూనే ఉంది. అయితే కరోనా నియంత్రణ కోసం మహాసుదర్శన కాడ ఆయుర్వేద ఔషదం మంచి ఫలితాలను ఇస్తోందని వైద్యులు చెబుతున్నారు. బైద్యనాథ్ కంపెనీతోపాటు, పలు ఆయుర్వేద కంపెనీలు ఈ మందును ఉత్పత్తి చేస్తున్నాయ్. మహాసుదర్శన కాడ అన్ని ఆయుర్వేద షాపుల్లోనూ లభిస్తుంది. కరోనాతో బాధపడుతున్నవారికి సైతం ఈ మందు దివ్యౌషధమంటున్నారు. ముఖ్యంగా జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పుల నియంత్రణకు ఈ మందు చక్కగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. వేపకాయలు, చరక సంహితలో చెప్పిన మస్టా పౌడర్, శొంటి, పరపట్ ఆకులు, చిరాతా ఆకులు, కుటికి, తిప్పతీగ (గుడుచి) ఇందులో ప్రధానంగా వినియోగిస్తారు. రోజుకు రెండు సార్లు కానీ మూడు సార్లు గానీ ఇ ఔషధం తీసుకోవచ్చు. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసిన తర్వాత 10 ML వాడాలి. అదే మోతాదులో నీటిని కూడా కలపుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *