ఎమ్మెల్సీ ఎన్నికల రేసులో కోదండరామ్

Share this Page

ఆ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం అక్కర్లేదు. తెలంగాణ ఉద్యమానికి ఆయన గొంతుక. తెలంగాణ ఉద్యమానికి అత్యధికంగా పనిచేసి… చివరకు తెలంగాణ నిర్మాణంలో ఎలాంటి పాత్ర లేకుండా మిగిలిపోయారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కాని వారు కూడా పెద్ద పెద్ద పోజిషన్లలోకి వచ్చారు. అయితే కోదండరామ్ మాత్రం ఎలాంటి పదవుల్లేకుండా ఉండిపోయారు. అవును కోదండరామ్ ప్రొఫెసర్… తెలంగాణ ఉద్యమంలో చేసిన త్యాగాలు అన్నీ ఇన్నీ కావు. కేసీఆర్ కు తల్లోనాలుకలా ఉన్న నేత నేడు… ఆయనకు పూర్తిగా దూరమయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కు కీలక పాత్ర పోషించిన కోదండరామ్ ఆ తర్వాత రాజకీయాల్లో సరైన స్థాయికి వెళ్లలేకపోయారు. పార్టీ పెట్టినా అది నామ్ కే వాస్త్ గా మారిపోయింది. నేతలంతా ఒక్కొక్కరిగా కోదండరామ్ కు హ్యాండిస్తే ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ బరిలో దిగారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కోదండరామ్ బరిలో నిలుస్తున్నట్టుగా పార్టీ నేత పీఎల్ విశ్వేశ్వరరావు చెప్పారు. ఆల్ ద బెస్ట్ కోదండరామ్ సర్… మీరు ఈసారి కచ్చితంగా విజయం సాధించాలె.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *