జగన్ ఢిల్లీ పర్యటన రహస్యం

Share this Page

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పూర్తయ్యింది. మీడియాలో వస్తున్న వార్తలకు భిన్నంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన సాగినట్టుగా తెలుస్తోంది. ఏపీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై క్లాస్ పీకేందుకు ఢిల్లీ పెద్దలు జగన్మోహన్ రెడ్డిని పిలిచినట్టుగా మాబాగా కొందరు ప్రచారం చేశారు. అయితే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఏం జరిగిందో కొందరికే తెలుసు. విభజన చట్టం ప్రకారం ఏపీకి నిధులు ఇవ్వాలని ప్రభుత్వం ఏప్పట్నుంచో కోరుతోంది. బీజేపీకి పూర్తి మెజార్టీ రావడంతో ఇచ్చిందే తీసుకోవాలి… ప్రత్యేక హోదా డిమాండ్ చేయడానికి లేకుండా పోయిందని సీఎం జగన్ చాన్నాళ్ల కిందట ఢిల్లీ సాక్షిగా చెప్పారు.

అయితే ఇప్పుడు వైసీపీకి, బీజేపీకి మధ్య రిలేషన్ బాగా బిల్డప్ అయ్యిందన్న అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన సారాంశం చాలానే ఉంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా పెట్టిన వ్యవసాయ బిల్లుకు పలు పార్టీలు వ్యతిరేక స్టాండ్ తీసుకున్నా… వైసీపీ మాత్రం ప్రభుత్వానికి మద్దతిచ్చి… వ్యవసాయ బిల్లుతో రైతులకు మేలు జరుగుతుందని చెప్పింది. అదే సమయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు జైకొడుతోంది. ఇలాంటి సమయంలో… ఎన్డీఏలో వైసీపీ జాయిన్ అయితే అది తమకు ఎంతో మేలు చేస్తుందన్న భావనలో అటు ఆర్ఎస్ఎస్, బీజేపీ వర్గాలున్నాయ్. భవిష్యత్ లో మోదీ తీసుకోబోయే అసాధారణ నిర్ణయాలకు ఏపీలాంటి రాష్ట్రం మద్దతు కీలకమే. ఇప్పటికే కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు జగన్ జై అంటున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ తోపాటు, పాలనకు సంబంధించిన విశేష మార్పుల చట్టాలకు జగన్ జైకొట్టే అవకాశం కూడా ఉందన్న అభిప్రాయం ఉంది. రాష్ట్రానికి సాయం విషయంలో చొరవ చూపిస్తే… ఏం చేయడానికైనా సిద్ధమన్న భావన జగన్‎లో ఉందని తెలుస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ, ఎన్డీఏలో చేరడం సూచనప్రాయంగా ఖారారైనట్టుగా తెలుస్తోంది. బీహార్ ఎన్నికలకు ముందుగానే కేంద్ర మంత్రి మండలి విస్తరించాలన్న ఆలోచనలో కూడా మోదీ ఉన్నారు. కొందరు మంత్రులను తప్పించి… కొత్తగా మరికొందరిని కేబినెట్లోకి తీసుకోవాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. సో కేంద్రంలో వైసీపీ చేరడం లాంఛనమే అనుకోవాలి. రెండు లేదా మూడు కేబినెట్ బెర్తులు వైసీపీకి కేటాయించే ఛాన్స్ కూడా ఉంది. విజయసాయిరెడ్డికి కేబినెట్ హోదా, మరో ఇద్దరు ఒక ఓసీ, ఒక బీసీ నేతకు కేబినెట్లో చోటు లభించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. వైసీపీ కేబినెట్లో చేరుతుందన్న ప్రచారం గత ఐదారు నెలలుగా ప్రచారంలో ఉంది.

అదే సమయంలో బీజేపీని ఏపీ కేబినెట్లో చేరాలని కూడా జగన్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. సో… ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పుతున్న స్థానిక బీజేపీని కట్టడి చేసేందుకు ఇది మహా అవకాశంగా వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. వాస్తవానికి మోదీ మాట జగన్ జవదాటే పరిస్థితి లేదన్న ఫీలింగ్ ఉన్నప్పటికీ… ఇద్దరూ పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అడుగులు వేయాల్సి ఉందన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా ఏపీలో దేవాలయాలపై దాడులు, న్యాయవ్యవస్థపై దాడుల అంశాలు అమిత్ షాతోపాటు, కేంద్ర పెద్దల మధ్య చర్చకు వచ్చాయో… రాలోదే తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే వైసీపీ, బీజేపీ బంధం స్ట్రాంగ్ కాబోతున్నట్టు సంకేతాలు కన్పిస్తున్నాయ్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *