సంప్రదాయంలోనే ధర్మం ఉంటుందా?

Share this Page

సంప్రదాయంలో ధర్మం నివసిస్తుంది. అలాగే సంప్రదాయాలే ధర్మాన్ని పరిరక్షిస్తున్నాయన్నదే సత్యం. మరైతే కేవలం… సంప్రదాయమే ధర్మమా?  ఆలోచించండి… వాస్తవానికి బండరాయిలో శిల్పం దాగి ఉంటుంది. అదే విధంగా సంప్రదాయంలో ధర్మం దాగి ఉంటుంది. బండరాయే శిల్పం కాదు… శిల్పానికి అకృతి ఇవ్వడానికి దాన్ని చెక్కవలసి ఉంటుంది. అనవసరమన భాగాలను చెక్కక తప్పదు. సరిగ్గా అదే విధంగా… సంప్రదాయంలో ధర్మాన్ని వెతికి పట్టుకోవాలి. ఇంద్రపూజ సంప్రదాయానికి దూరమై….  గోవర్ధన పూజ అనే ధర్మాన్ని అనుసరించకపోతే… యాదవులకు ముక్తి మార్గం లభించి ఉండేది కాదు.

సంప్రదాయాన్ని పూర్తిగా విడనాడే వారు… ధర్మానికి దూరమవుతుంటారు. అలాగే సంప్రదాయాన్ని గుడ్డిగా అనుసరించేవారికి… ధర్మ మర్గం లభించడం దుర్లభం. హంసకు నీరక్షణ న్యాయం తెలుసు. పాలలో కలిసిన నీటిని వేరుచేసి… కేవలం పాలనే తాగుతుంది. సరైన ధర్మాన్ని తెలుసుకోవాలంటే… హృదయంలో జ్ఞానం వల్ల లభించిన వివేకం ఎంతో అవసరం… వివేకం లేనప్పుడు దేనినైతే ధర్మమని నమ్ముతారో… అది వాస్తవానికి ధర్మం కాకపోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *