న్యాయానికి, ప్రతీకారానికి మధ్య ధర్మం ఉంటుందా?

Share this Page

ఓ వ్యక్తికి… ఏదైనా ఘటనలో అన్యాయం జరిగిందని తలచినప్పుడు… అతని అంతరంగం కుదుపునకు గురౌతుంది. చుట్టూ ఉన్న మనుషులు ఆ వ్యక్తికి శత్రువుల వలే కన్పిస్తారు. అన్యాయం జరిగిన తీరు ఎంత పెద్దదయితే… మానవ హృదయం సైతం చుట్టూ ఉన్న పరిస్థితులను విరోధిస్తుంటుంది. ఇలాంటి స్థితిలో న్యాయం కావాలని వారు సహజంగా కోరుకుంటారు. అలా కోరుకోవడం చాలా చాలా సహజం. వాస్తవానికి సమాజంలో ఏ విధమైన అన్యాయమైనా వారికి ఆయా వ్యక్తులపై ఉన్న విశ్వాసానికి, నమ్మకానికి పునాది వంటిది.

ఇంతకీ… న్యాయం అంటే? న్యాయానికి అర్థమేంటి? అన్యాయం చేసినవారు తాము… చేసిన దానికి పశ్చాత్తాపం చెందాలి. అలాగే అన్యాయానికి గురైన మనసులో సమాజంపై విశ్వాసం కలుగుతుందా? న్యాయానికి అర్థం ఇదేగా… ధర్మాన్ని ఎవరైతే ఆచరించరో…  వారు న్యాయాన్ని వదిలేసి… వైరాన్ని, ప్రతీకారాన్ని ముద్దడాతారు.  హింసకు బదులుగా ప్రతిహింస అనే భావనతో సాగుతారు. ఇతరుల పట్ల… తాము అనుభవించిన బాధకంటే ఎంతో ఎక్కువ బాధను కలిగించే కుట్రలు చేస్తారు. అన్యాయానికి బలైనవారే స్వయంగా… అన్యాయం చేస్తారు. దీంతో వారూ అపరాధులవుతారు. న్యాయానికి, ప్రతీకారానికి మధ్య అంతరమే ధర్మం. ధర్మాన్ని ఆచరించినప్పుడే న్యాయ, అన్యాయ విచక్షణ పొందగలుగుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *