క్లైమాక్స్‎కు వంటలక్క కథ …!?

Share this Page

మాటీవీలో మూడేళ్లుగా వస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు ట్విస్టులతో సాగుతుంది. ఎందుకు ఈ సీరియల్ మూడేళ్లు దాటినా అదే దమ్ముతో సాగుతుందో ఆ ఘటనలు… పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. కమల పిల్లల్ని కన్న వంటలక్క నుంచి ఒక కూతుర్ని తీసుకెళ్లి… సౌందర్య తీసుకెళ్లి కొడుకు కార్తీక్ వద్ద పెంచడాన్ని చరిత్రలో చూశాం. అయితే ఆ చిన్నారి హిమ ఇప్పుడు నా తల్లిదండ్రులెవరంటూ అడగడం… కార్తీక్ మైండ్ బ్లాంక్ అవడం జరిగిపోయాయ్. ఇదే సమయంలో రంగంలోకి దీప, సౌందర్య (అత్తాకొడళ్లు) రంగ ప్రవేశం చేయడం కొత్త ట్విస్ట్ ఇచ్చాయ్. ఇప్పుడు సౌందర్య, దీపను ఇంటికి తీసుకురావడం… నేను నా కోడలికి గౌరవం తగ్గకుండా చూస్తానని చెప్పడం… హిమకు తనే తల్లి అని చెప్తానంటూ దీప చేస్తున్న వ్యాఖ్యలు మొత్తంగా వచ్చే రోజుల్లో సీరియల్ మరింత రక్తి కట్టడం ఖాయంగా కన్పిస్తోంది. కన్నడంలో ఐదేళ్లు సాగిన ఈ కార్తీక దీపం తెలుగులో కనీసం ఇంకా నాలుగేళ్లు నడవడం ఖాయం. ఎందుకంటే ఐపీఎల్ వచ్చినా.. 7.30 ప్రైమ్ టైమ్ లో అదే రేటింగ్ సాధిస్తున్న సీరియల్ గా ఇది రికార్డు సృష్టిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *