ఒకే ఒక్క సమస్య జీవితాన్ని నాశనం చేసేస్తుందా?

Share this Page

జీవితంలో కొన్ని సంఘటనలు… మన ప్రణాళికలను తునా తునకలు చేసేస్తాయ్… వాస్తవానికి అది దురదృష్టమో కాదు… పతనం అంతకంటే కాదు… కానీ అలాంటి ఘటనకు జీవితంలో కీలక స్థానమిచ్చి… దాని గురించే ఆలోచిస్తుంటాడు. ఏ ఒక్కరినీ… ఏ ఒక్క సమస్య నేలమట్టం చేయలేదు. వ్యక్తుల భవిష్యత్తన్నది…  ప్రణాళికల ఆధారంగా జరుగుతుంది. జీవితంలో ఒక వ్యక్తి… ఒక సవాలును ఎదుర్కోనేందుకు… ప్రణాళిక మేరకు అడుగులు వేయాల్సి ఉంటుంది.

అయితే ఆ సమయంలో వచ్చే సమస్యలు, సంక్షోభాలను ఆయా సందర్భానుసారం ఎదుర్కొంటున్న సమయంలో కొత్త సమస్యలు తలెత్తవచ్చు. లక్ష్యాన్ని చేరుకునే సమయంలో కొత్త కొత్త సమస్యలు చుట్టుముడతాయ్. అనుకోని అవరోధాలు ఎదురవుతాయి. అలాంటి సమయంలో పరిస్థితులకు అనుగుణంగా… నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. విజయం సాధించేందుకు ప్రణాళికను ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సి ఉంటుంది.

ముందుగా అనుకున్న ప్రకారం అడుగులు వేస్తే అతను ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతాడు. అందుకే సమస్య తీవ్రతను బట్టి తనను తాను… మార్చుకుంటాడు. జీవితంలో ఎదర్కొనే అవరోధాన్నే కేంద్రబిందువుగా భావిస్తే జీవితంలో విజేతగా నిలవడం సాధ్యం కాదు.  మొత్తంగా సుఖశాంతులన్నవి అస్సలే లభించవు.  అందుకే జీవితాన్ని తమకు అనువుగా… మలచుకునే బదులు… ఆయా పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోగలిగితే…. విజయం దానంతటే అదే లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *