గీత దాటితే కాల్చిపారేస్తారు… అక్కడ అంతే…

Share this Page

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఏం చేసినా సంచలనమే. ఆయన కన్పించినా సంచలనమే… ఆయన కన్పించకున్నా సంచలనమే. అవును మరి… ప్రపంచంలో ఏద దేశంలో ఇలాంటి నేతను మనం చూసి ఉండం. రాజకీయమైనా… హెచ్చరికలైనా ఏవైనా అది ఆయనకే చెల్లింది. కిమ్ ఓ తెలివిగల పూజరని… అగ్రరాజ్య అధినేత ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏవో లైట్ తీసుకోడానికి లేదని అనుకోవాల్సిందే. ఎందుకంటే మరి కిమ్ లో ట్రంప్ చూసిందేంటో మనకు తెలియదు కదా… అయితే తాజాగా కిమ్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు… ఉత్తర కొరియాలో కరోనా కట్టడి కోసం కిమ్ ఓ రేంజ్ లో నిర్ణయం తీసుకున్నాడు. చైనా నుంచి ఎవరైనా ఉత్తర కొరియా భూభాగంలో కాలుపెట్టారో ఖబడ్దార్ అంటూ తేల్చేశాడు. అంతేనా కన్పిస్తే కాల్చి వేతల ఉత్తర్వులు జారీ చేశాడు. కిలో మీటర్ పరిధిలో ఉత్తర కొరియా బలగాలను భారీగా మోహరించాడు కిమ్. ఇప్పుడు ఎవరైనా సరే చైనా నుంచి వచ్చారంటే మాత్రం ఇక వారు చావాల్సిందే. కరోనా ఉన్నా లేకున్నా వారిని మాత్రం కాల్చి పారాయాల్సిందేనంటూ సైన్యానికి ఆదేశాలు జారీ చేసేశాడు. ఈ విషయాన్ని ఉత్తర కొరియాలో ఉంటున్న అమెరికా అధికారి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *