బీసీలను చంద్రబాబు మోసం చేస్తే… జగన్ మేలు చేస్తున్నారు-పోతుల

Share this Page

బి.సి లకు సముచిత న్యాయం చేస్తామని కల్లబుల్లి మాటలు చెప్పిన చంద్రబాబు బి.సిలకు మొండి చేయి చూపారని… జగన్మోహనరెడ్డి చేస్తున్న అభివృద్ధి ని కుటిల రాజకీయాలతో అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని.. తెలుగు దేశం పార్టీలో 20 సంవత్సరాలు పని చేస్తే ఒక బి.సి మహిళనైన నన్ను ఎన్నో అవమానాలకు గుచేశారని ఎమ్మెల్సీ పోతుల సునీత ఆవేదన వ్యక్తం చేశారు.

139 బి.సి కులాలకు గను 56 కార్పోరేషన్ లకు ఏ.పి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి చైర్మన్ లను నియమించిన సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల లో వైకాపా నాయకులు కారణం వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బి.సి పండుగ సందర్భంగా దివంగత నేత వై.ఎస్.ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ పోతుల సునీత చంద్రబాబు పై విమర్శలు గుప్పించారు.జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లో బి.సి లకు ఇచ్చిన మాట ప్రకారం బి.సి 56 ఉపకులాలకు కార్పోరేషన్ లు ఏర్పాటు చేయటమేకాక 50 శాతం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా పార్లమెంట్ లో తీర్మానాన్ని ప్రవేశ పెట్టి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే చంద్రబాబు కుటిల రాజకీయాలతో అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ గా ఉండి జగన్ ప్రభుత్వానికి జై కొట్టిన పోతుల సునీత అన్నారు.20 సంవత్సరాలు తెలుగు దేశం పార్టీని నమ్ముకుని ఆ పార్టీ కోసం పనిచేస్తే అనునిత్యం చంద్రబాబు ఎన్నో అవమానాలకు గుచేశారని..ఎక్కడో ఉన్న ఆమెను చీరాలకు పంపి అక్కడ కూడా అవమాలపాలు చేశారని అది సహించలేక రాష్ట్రాన్ని అభివృద్ధి పధం లో నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలిపామని పోతుల సునీత అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *