కరోనా వస్తే ముఖ్యమంత్రిని కౌగిలించుకుంటా…

Share this Page

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ సెక్రటరీ అనుపమ్ హజ్రాపై బెంగాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా వస్తే… బెంగాల్ సీఎం మమత బెనర్జీని కౌగిలించుకుంటానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ముఖ్యమంత్రి, మహిళా నేతపై ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేసినందకు గాను తృణముల్ నేతలు ఫిర్యాదు చేశారు. డార్జిలింగ్ జిల్లా సిలిగురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఉత్తర బెంగాల్ లో ఉన్న పరిస్థితులను అంచనా వేసేందుకు మమత డార్జిలింగ్ పర్యటనకు వస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు బీజేపీ నేత అనుపమ్. కరోనా కారణంగా కుటుంబ సభ్యులు కోల్పోయిన వాళ్ల బాధ మమత బెనర్జీకి తెలియాలని… అందుకే ఆమెను కరోనా వస్తే కౌగిలించుకోవాలనుకుంటున్నానంటూ కామెంట్ చేశాడు. ఐతే ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆలోచించుకోవాలంటూ తాజాగా బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన ముకల్ రాయ్ వ్యాఖ్యానించడంతో… అనుపమ్ పై పార్టీ నేతలు సైతం గుస్సాగా ఉన్నట్టు అర్థమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *