అక్కడ చోటు కోసం భారత్ ఎన్నాళ్లు వేచి ఉండాలి?

Share this Page

ఇంకా ఎన్నాళ్లు ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ వేచి చూడాలంటూ ప్రధాని మోదీ…యూఎన్ సాక్షిగా గట్టిగా మాట్లాడారు. కీలక నిర్ణయాలు తీసుకునే సమితిలో భారత్ లేకుండానే ఎంత కాలమంటూ ప్రపంచ దేశాలను ప్రశ్నించారు. బలహీనంగా ఉన్నప్పుడు ప్రపంచంలో ఎలాంటి అలజడి సృష్టించలేదు. బలహీనంగా ఉన్నప్పుడు ప్రపంచానికి భారత్ భారం కాలేదని… బలపడే కొద్దీ ఎవరికీ బరువు కాలేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి శాంతి దళంలో భారత్ సైన్యాన్ని పంపిస్తూనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వసుధైక కుటుంబమన్న స్ఫూర్తితో వ్యవహరించే భారతీయులు… ప్రపంచ సంక్షేమాన్ని, సౌభ్రాతృత్వాన్ని కాంక్షిస్తుందన్నారు మోదీ. 130 కోట్ల మంది పౌరులున్న భారత్ ఇంకెన్నాళ్లు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాలన్నారు. ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వతసభ్యత్వం కోసం ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తోందన్నారు. ఐక్యరాజ్యసమితిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ ఇప్పటికి ఏడు సార్లు సభ్యత్వం దక్కించుకోంది. ఇటీవల రీఎలక్షన్ సందర్భంగా… సభ్య దేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు వేగవంతం చేయాలంటూ ఇప్పటికే భారత్, బ్రెజిల్, సౌతాఫ్రికా డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *