వంటలక్కకు గృహలక్ష్మి పొగ

Share this Page

ఏ సీరియల్ ఐనా చాలా కాలం సాగదీయడం దర్శక నిర్మాతలకు, అటు చానెల్ కు ఇబ్బందే. ఏళ్ల తరబడి నడుస్తున్న సీరియళ్లను మహిళా లోకం తప్పనిసరి పరిస్థితుల్లో భరిస్తుంది. అయితే కొన్ని సీరియళ్లు సక్సెస్ ఫార్ములా అయినా అత్తా కొడళ్ల మధ్య సంబంధాలు... హీరో హీరోయిన్ మధ్య వచ్చే వ్యాంప్ వ్యవహారాలే కథనాలుగా ఉంటున్నాయ్. ఇలా ఒక రోజు సీరియల్  నడిపినట్టుగా మరో రోజు నడపలేరు. సాగదీత, స్తబ్ధతతో రోజుల తరబడి నడుస్తున్న సీరియళ్లతో తెలుగు టీవీ సీరియళ్లు సాగిపోతున్నాయ్. మాటీవీలో వస్తున్న కార్తీక దీపం 16 అక్టోబర్ 2017లో ప్రారంభమయ్యింది. అంటే వచ్చే నెలలో ఈ సీరియల్ మూడేళ్లు పూర్తి కాబోతుంది. మళయాళ మాతృక అయిన కార్తీక దీపం సీరియల్ అక్కడ దాదాపుగా ఐదేళ్ల సాగింది. సో ఇంకా రెండేళ్లు సీరియల్ నడపిస్తారన్నమాట. కార్తీక, దీప కలవడానికి ఇంకా తెలుగు జనాలు రెండేళ్లు ఎదురు చూడాల్సిందే. ఇక తెలుగులో అర్ధగంటలో 15 టీఆర్పీ పాయింట్లతో దూసుకుపోతున్న ఈ సీరియల్ చానెల్ కు చాలా ఫెచింగ్ తీసుకొస్తోంది.  కానీ ఎన్నాళ్లన్నది ఇప్పుడో ఇంటరెస్టింగ్ వ్యవహారం కొత్త చర్చకు కారణమవుతోంది.  కార్తీక దీపం సీరియల్ కు పోటీ ఇప్పుడో అదే చానెల్ లో వస్తున్న మరో సీరియల్ కారణం కాబోతుందా అన్పిస్తోంది
 అవును. ఇది నిజమే...  ఇంటింటి గృహలక్ష్మి ఈ ఏడాది మార్చి 20న ప్రారంభమయ్యింది. కార్తీకదీపం సీరియల్లో వంటలక్క పాత్రకు ఇప్పుడు తెలుగు జనం అతుక్కుపోయారు. అయితే ఆ సీరియల్ సాగదీత ఎక్కువవడంతో ఆ రేటింగ్ ఎన్నాళ్ల పాటు వస్తుందా అన్న అనుమానం కూడా ఉంది. ఎందుకంటే గృహలక్ష్మి సీరియల్ ఇప్పుడు ఆసక్తికర కథనాలతో దూసుకుపోతోంది. రోజూ వచ్చే పంచ్ డైలాగులతో సీరియల్ ఊహకు అందనట్టుగా ముందుకు సాగుతోంది. తమిళ్ హీరోయిన్ కస్తూరిని లీడ్ రోల్ లో తీసుకొచ్చిన ఈ సీరియల్ లో కీలక పాత్రలో ప్రశాంతి... కస్తూరి భర్తను ట్రాప్ చేస్తున్న తీరు చాలా చాలా ఇంటరెస్టింగ్ గా కన్పిస్తోంది. సీరియల్ ను ఇలా ఎంత పకడ్బందీగా దర్శక నిర్మాతలు చేయగలరన్నదానిపైనే మొత్తం వ్యవహారం ఆధారపడి ఉంది. కస్తూరి నటన మాత్రం నభూతో నభవిష్యతి. భర్తను చెడుగుడాడుకుంటూ సాగుతున్న కథనం రోజు రోజుకు రక్తికడుతోంది. ఇల్లాలంటే ఇలా కదా ఉండాల్సిందన్నట్టుగా గృహలక్ష్మి సీరియల్ సాగుతోంది. ప్రస్తుతం కార్తీక దీపం కంటే  గృహలక్ష్మి రేటింగ్ కొంత తక్కువైనప్పటికీ త్వరలో గృహలక్ష్మి కార్తీక దీపం సీరియల్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. అంటే చానెల్ కు కాసుల వర్షమన్నమాట. అదే సమయంలో పోటీ చానెళ్లకు 8PM స్లాట్ టైట్ లా మారిపోతుందనుకోవాల్సి ఉంటుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *