మొగుడి సుఖం కోసం తపిస్తున్న గృహలక్ష్మి

Share this Page

మాటీవీలో దుమ్మురేపుతున్న గృహలక్ష్మి

మొగుడు అంటే ఇష్టమా…కష్టమా… లేక మొగుడికి నచ్చినట్టు నడుచుకోవడమా… అదేదో పెళ్లైన నాలుగేళ్లకో, ఐదేళ్లకో కాదు… పెళ్లైన పాతికేళ్లకు మరో సెటప్‎తో సెటిల్ అయిపోయే మొగుడి పాత్రధారితో గృహలక్ష్మి సాగిస్తున్న తీరు నభూతో నభవిష్యతి. మాటీవీలో ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్… వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది. మొగుడిని చడామాడ ఉతికారేసే పాత్రలో అలనాటి నటి కస్తూరి చేస్తున్న అభినయం నభూతో నభవిష్యతి. పెళ్లైన మగాడిని ట్రాప్ చేసే పాత్రలో ప్రశాంతి నటన సూపర్బ్ అని చెప్పాల్సిందే. ప్రతి ఒక్కరు ప్రశాంతిని తిట్టుకుంటున్నారంటే అది ఆమె పాత్రలో ఆ రకంగా నిమగ్నమైపోయిందనుకోవాలి. ఒక రేంజ్ లో సాగుతున్న గృహలక్ష్మి తాజా ఎపిసోడ్… మొగుడు పెళ్లాల సంబంధాన్ని అత్యంత అద్భుతంగా ఆవిష్కరించింది. గుండెపోటుతో కూలిపోయిన భర్తకు.. భవిష్యత్ ను అర్థమయ్యేలా చెప్పడమంటే ఆషామాషీ కాదు. పెళ్లాన్ని కాదని పరాయి స్త్రీని ఇష్టపడేవారితో పనేంటన్న లెక్కతో కథనాన్ని వండివారుస్తున్నారు. డైలాగులు మాత్రం ఓ రేంజ్ లో రాస్తున్నారు. పెద్దగా సాగదీతలో కూడా గట్టి డైలాగులు పడుతున్నాయ్. మొగుడుతో పనిలేదంటూ పోరాటం సాగిస్తున్న గృహలక్ష్మి భవిత మాత్రం సూపరో సూపర్ అని చెప్పాల్సిందే… ఈ సరియల్ వచ్చే రోజుల్లో నెంబర్ 1 స్థానానికి చేరుకున్నా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *