కడుపు ఉబ్బరం, గ్యాస్ మంట ఇలా పోతుంది… ట్రై చేయండి

Share this Page

నిత్యం మనకు ఎదురయ్యే ఎన్నో సమస్యలకు మన ప్రకృతిలోనే పరిష్కారాలు లభిస్తాయి. ప్రకృతి మనకు ఎంతో ఇచ్చింది. ఎన్నో విషయాలను తెలుసుకోవడం ద్వారా మనకు వైద్య చికిత్స చాలా తేలిగ్గా అర్థమవుతుంది. గ్యాస్ ట్రబుల్ ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. గ్యాస్ సమస్యకు చిన్న చిట్కాలు పాటిస్తే చాలా సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. గ్యాస్ ప్రొబ్లమ్ వల్ల ఒక్కొక్కరికి ఒక్కోరకమైన సమస్య ఎదురవుతుంది. కొందరికి తేనుపులు అదే పనిగా వస్తుంటాయ్. కొందరికి పుల్ల తేనుపులు వస్తాయ్… పుల్లని వస్తువులు తిన్నప్పుడు కూడా రానంత ఎక్కువగా పుల్ల తేనుపులు వస్తాయ్. కొందరికి పొత్తి కడపులో సన్నగా నొప్పి కలుగుతుంది. ఇలాంటి వాళ్లందరూ పాటించాల్సిన చిన్న చిట్కా మన ఆయుర్వేదంలో చాలా ప్రసిద్ధి చెందింది.


ఇది కేవలం వైద్య చిట్కాయే కాదు… ఒక దివ్యౌషధం… అవును ప్రతి రోజూ ఉదయం జిలకర నానబెట్టిన వాటర్ 250 ml తీసుకుంటే సరిపోతుంది. ఎలాగంటి… ముందు రోజు రాత్రి పూట ఒక గ్లాసు నీళ్లలో చెంచాడు జిలకర వేసుకొని… మరుసటి రోజు ఉదయం జిలకర వడకట్టి ఆ వాటర్ తాగడం వల్ల శరీరం ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అదే సమయంలో తేనెపులు, పుల్ల తేనుపులు, పొత్తికడుపులో సన్నటి నొప్పి, విపరీతమైన కడపు నొప్పి వచ్చే వారిలో సైతం ఈ చికిత్స చాలా మార్పు కలిగిస్తుంది. అల్లోపతి వైద్యులు సైతం ఈ తరహా సూచనను సూచిస్తున్నారు. సో గ్యాస్ ట్రబుల్‎ను మన శరీరం నుంచి దూరం చేయాలంటే కొంత కాలం పాటు రోజూ జిలకర నానబెట్టిన నీరును తాగితే సరిపోతుంది. సో… ఫ్రెండ్స్ మీరందరికీ సోది లేకుండా సుత్తి లేకుండా చాలా సింపుల్ గా విషయం అర్థమైఉంటుందని భావిస్తున్నాను…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *