ఇతరుల నుంచి ఆశించడం వల్ల బాధే మిగులుతుందా?

Share this Page

మానవుల అన్ని సంబంధాలకు ఆధారం ఆపేక్ష. ఆపేక్ష అంటే ఎవరి నుంచైనా ఏదైనా ఆశించడం. భర్త ఎలా ఉండాలని అడిగితే… నా జీవితాన్ని సుఖసంతోషాలతో నింపేయాలని భార్య చెబుతోంది. భార్య ఎలా ఉండాలని అడిగితే… ఎన్నటికీ తన మాట జవదాటరాదని… తనకు   అంకితమై ఉండాలంటాడు భర్త. సంతానం ఎప్పుడూ తమను కనిపెట్టుకొని ఉండాలని… తమకు నిరంతరం సేవ చేయాలని… ఇచ్చిన అన్ని ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటించాలని కోరుకుంటారు.

తమ కోరికలను  గౌరవించేవారిని… బాగా ప్రేమించేవారిని, తన సుఖం కోరుకునేవారిని మాత్రమే సాటి మనిషి అభిమానిస్తూ ఉంటాడు.  అలా ఎప్పుడూ సాధ్యమవుతుందా? అన్ని సార్లు జరగకపోవచ్చు. అలాంటప్పుడు వారి ఆలోచనలకు విఘాతం కలగడం సాధారణమే. ఎందుకంటే… ఎక్స్‎పెక్టేషన్ అన్నది మనుషుల… మెధడులో పుడుతుంది. వాస్తవానికి ఎవరి మనసులో ఏముందో ఎవరైనా ఎలా తెలుసుకుంటారు? 

కొందరి కోరికలను మరికొందరు ఏ మాత్రం తెలుసుకోరు. ఒకవేళ ఆయా వ్యక్తుల ఆకాంక్షలను నెరవేర్చాలన్న తపన ఎంతగా ఉన్నప్పటికీ… ఏ మనిషి ఇతరులు ఆశిస్తున్నట్టుగా వ్యవహరించలేడు. ఇక అక్కడ్నుంచే జన్మిస్తుంది సంఘర్షణ… అన్ని సంబంధాలు… సంఘర్షణ రూపంలోకి మారిపోతుంటాయి. సంబంధాల ఆధారంగానే వ్యక్తి ఆలోచనలు, కోరికలు మారుతుంటాయి. ఈశ్వర ప్రసాదమైన మన  జీవితం స్వయంగా తనలో సుఖశాంతులను నింపుకోలేదా? కచ్చితంగా సాధ్యమే. తృప్తి అన్నది పరిధి అయితే సుఖాన్ని తప్పక పొందగలుగుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *