నిర్ణయాధికారం వ్యక్తుల జీవితాలను శాసిస్తుందా?

Share this Page

జీవితంలో ప్రతిక్షణం మనం తీసుకునే నిర్ణయాల ఆధారంగానే సాగుతుంది. ప్రతి అడుగులోనూ… రెండో అడుగుకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేసుకోవాల్సిందే. తీసుకున్న నిర్ణయాలు మనపై ప్రభావం చూపిస్తాయి. ఇవాళ తీసుకున్న నిర్ణయాలు…  భవిష్యత్‎లో సుఖానికో… లేక దుఃఖానికో కారణాలవుతుంటాయి. ఆ నిర్ణయాలు కేవలం తనకు మాత్రమే కాదు… తన కుటుంబానికి… అలాగే రానున్న తరాలపై ప్రభావం చూపెడతాయి. అలా తీసుకున్న నిర్ణయాల కారణంగా సందిగ్ధత ఏర్పడితే… అప్పుడు మనసు… దుఃఖ భరితమవుతుంది. అతలాకుతలమైపోతుంది.  నిర్ణయించుకున్న ఆ క్షణం యుద్ధమే అవుతుంది. ఆ మనుసు రణభూమిగా మారిపోతుంది. సాధారణంగా నిర్ణయాలు సందిగ్ధతను పారద్రోలేందుకు… మనసును శాంతింపజేయాడానికే తీసుకుంటాం…

ఎవరైనా పరిగెడుతూ భోజనం చేయగలరా ? చేయలేరు…?  అయితే యుద్ధానికై ఉర్రూతలూగే మనసు ఏదైనా సరైన నిర్ణయం తీసుకోగలుగుతుందా? వాస్తవానికి… శాంత మనఃస్తితిలో ఏదైనా నిర్ణయం తీసుకుననప్పుడు… అది తమ కోసం సుఖమయ భవిష్యత్‎ను నిర్మిస్తుంది. కానీ… మనసును ప్రశాంతంగా ఉంచుకోడానికి అప్పటికప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకుంటే… ఆ వ్యక్తి భవిష్యత్‎లో కంటకభరితమైన వృక్షం నాటినట్లే.  అలాంటి నిర్ణయాలు జీవితాన్ని ముల్లుల్లా గుచ్చుతుంటాయ్. ఒకోసారి చేసిన తప్పును దిద్దుకోవడమన్నది అత్యంత కష్టంగా మారుతోంది. అందుకే నిర్ణయాలు తీసుకునే స్థాయిని బట్టి, వ్యక్తులను బట్టి వాటి ఫలాలు కూడా ఆధారపడి ఉంటాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *