మంచి చేస్తే సంతోషం, చెడు చేస్తే దుఃఖం కలుగుతాయా?

Share this Page

ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల మూలంగా… దుఃఖం లభించి… ఇంకొకరికి  చేసిన చెడు పనుల మూలంగా… సుఖం లభిస్తే… మనసుకి తప్పకుండా బాధకలుగుతుంది. సత్కార్యాలే చేయడం వల్ల ధర్మాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటని? అయితే దుర్మార్గులకు  ఏం లభిస్తుందో ఎప్పుడైనా గమనించారా?  దుర్మార్గుల హృదయం ఎప్పుడూ అల్లకల్లోలంగా… చిరాకుగా ఉంటుంది.  మనుసులో అనుక్షణం కొత్త కొత్త సంఘర్షణలు ఉద్భవిస్తుంటాయ్. అపనమ్మకం వారిని జీవితాంతం వెంటాడుతుంది. ఇదేనా సుఖమంటే…?

 అయితే ధర్మమార్గాన నడిచేవారు,  సత్కార్యాలు చేసేవారు,  సచ్ఛీలురైన వ్యక్తుల మనసు సర్వదా ప్రశాంతంగా ఉంటాయి. పరిస్థితులేవీ వారి జీవన విధానంలో బాధకరంగా ఉండవు. సమాజంలో గౌరవ మర్యాదలు… మనసుకు సంతోషాన్ని కలిగిస్తాయి. అనగా… సత్ప్రవర్తన అన్నది. భవిష్యత్‎లో లభించే సుఖాలకు మార్గం కాదు. సుఖానికి నిర్వచనమే సత్ప్రవర్తన. అదే విధంగా… దుష్ప్రవర్తన భవిష్యత్‎లో ఎదురయ్యే దుఃఖాలకు మార్గం కాదు. అధర్మం చేసిన క్షణమే… దుఃఖాలను ఉత్పత్తి చేస్తుంది. ధర్మం ఆచరిస్తే సుఖం రాదానుకుంటున్నారా? ధర్మానికి మరోపేరే సుఖం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *