నెల రోజుల్లో కరోనా వ్యాక్సిన్

Share this Page

కరోనా వైరస్ వ్యాక్సిన్ ఒక నెలలో సిద్ధమవుతుందన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. టీకా చాలా తొందరలోనే రాబోతోందంటూ టౌన్ హాల్ ప్రశ్నోత్తరాల సమావేశంలో ట్రంప్ తెలిపారు. కొరోనావైరస్ వ్యాక్సిన్ ఒక నెలలోనే లభిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.  అదే సమయంలో కరోనా దానంతట అదే అంతర్థానం అయిపోయే అవకాశం కూడా ఉందన్నారు.  వారాల్లో కరోనా వ్యాక్సిన్ రాబోతుంది… మూడు, నాలుగు వారాలు పట్టొచ్చు… లేకుంటే ఎనిమిది వారాలు కావచ్చని చెప్పారు.

నవంబర్ 3 న అధ్యక్ష ఎన్నికల్లో గెలవడం కోసం ప్రభుత్వ విభాగాలపై ట్రంప్ ఒత్తిడి చేస్తున్నాడంటూ డెమొక్రట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్య నియంత్రణ వ్యవస్థలు, శాస్త్రవేత్తలపై రాజకీయంగా ఒత్తిడి పెంచుతున్నారని డెమొక్రాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీకా ఆమోదం ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి వస్తోందని… అమెరికా ప్రభుత్వ అంటు వ్యాధుల వైద్యుడు ఆంథోనీ ఫౌసీతో సహా నిపుణులు ఇప్పటికే చెప్పారు. కరోనాతో అమెరికాలో 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని… కరోనాను కట్టడి చేయడం వల్లే అది సాధ్యమయ్యిందని… అమెరికన్లను ఎక్కువ భయపడకుండా ఉండేందుకు కరోనా తీవ్రతను తక్కువ చేసి మాట్లాడానంటూ ట్రంప్ కొద్దికాలంగా చెబుతూ వస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *