అమెరికా అధ్యక్షుడు ట్రంప్‎కు, భార్య మెలానియాకు కరోనా పాజిటివ్….

Share this Page

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దూసుకుపోతున్న ట్రంప్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భార్య మెలానియా సైతం పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయని తెలిపారు. భార్యాభర్తలిద్దరూ క్వారంటైన్ కు వెళ్తున్నట్టు ట్రంప్ చెప్పారు. అంతేకాదు… ఎన్నికల సమయంలో తనకు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్న హోప్ హిక్స్ సైతం పాజిటివ్ అంటూ చెప్పుకొచ్చారు. తిరిగి మరోసారి అధ్కక్షుడిగా గెలవాలని భావిస్తున్న తనకు హోప్ హిక్స్ ఎంతగానో సహకరిస్తుందని… రెస్టు లేకుండా పనిచేస్తున్నారని ట్రంప్ తెలిపారు.

Donald Trump’s closest advisors, Hope Hicks

ఆమెతో కలిసి ఎన్నో చర్చలు జరిపామని హోప్ హిక్స్ నిరంతరం మాస్కులు ధరిస్తూనే ఉన్నారని… అయినా పాజిటివ్ రావడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. హోప్ హిక్స్ పాజిటివ్ రావడంతో… భార్యాభర్తలిద్దరం క్వారంటైన్ వెళ్తున్నట్టు ట్రంప్ ట్విట్టర్లో తెలిపారు. అమెరికాలో క్వారంటైన్ నిబంధనల మేరకు 14 రోజులు విధిగా ఏకాంతంగా ఉండాల్సి ఉంటుంది. కరోనా విషయంలో ట్రంప్ సరిగా వ్యవహరించలేదన్న అభిప్రాయంలో అమెరికన్లు ఉన్నారని రిపోర్టులు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *