ఆ వ్యాఖ్యలు చేసిన ఎంపీని సాగనంపాల్సిందే…

Share this Page

బెంగళూరును తీవ్రవాద కేంద్రంగా అభివర్ణించిన బీజేపీ ఎంపీని తొలగించాలంటూ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఇటీవలే కొత్త నియమించిన బీజేపీ జాతీయ యూత్ వింగ్ అధ్యక్షుడు తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో బీజేపీకి సంకట పరిస్థితి తీసుకొస్తున్నాయ్. బెంగళూరు తీవ్రవాదానికి కేంద్ర బిందువుగా మారిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అటు బీజేపీలోనూ , ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ కలకలం రేపుతున్నాయి. ఎంపీ వ్యాఖ్యలు బెంగళూరు పరువు తీస్తున్నాయని… తక్షణం ఎంపీ రాజీనామా చేయాలని… లేదంటే పార్టీ ఆయనను తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ కీలక నేత డీకే శివకుమార్ డిమాండ్ చేశారు. ఐతే మొత్తం వ్యవహారాన్ని సీఎం యడ్యూరప్ప చాలా లైట్ తీసుకున్నారు. ఎన్ఐఏ కేంద్రాన్ని బెంగళూరులో ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని, హోం మంత్రిని ఇప్పటికే కోరామని.. ఆ విషయాన్నే ఇప్పుడు తేజస్వి చెప్పారన్నారు. ఇటీవల కేజే హల్లి, డీజే హల్లి ప్రాంతాల్లో జరిగిన గుంపు దాడులను ప్రస్తావించిన ఎంపీ… రెండు ప్రాంతాల్లో భారత వ్యతిరేక శక్తులు కుట్రలు చేస్తున్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *