రైతు బిల్లుతో దగా…దగా… కేసీఆర్ ఫైర్

Share this Page

కేంద్ర తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుతో రైతులకు మరిన్ని కష్టాలు వస్తాయని… రాజ్యసభలో ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని కోరారు తెలంగాణ సీఎం కేసీఆర్… సామాన్య రైతులను నడ్డివిరిచి… కార్పొరేట్లకు లాభం చేకూర్చేలా కేంద్రం వ్యవహరించడం దారుణమన్నారు కేసీఆర్. రైతులు దేశంలో ఎక్కడికైనా సరుకు తీసుకెళ్లి అమ్ముకోవడం ఎలా సాధ్యమవుతుందని… ఇదంతా కార్పొరేట్లకు దోచిపెట్టడానికి పనికి వస్తుందంటూ విమర్శలుగుప్పించారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు తెనెపూసిన కత్తి అంటూ ఆరోపించారు. దేశం ఇబ్బందుల్లో ఉన్న ఇలాంటి సమయంలో… ఇలాంటి బిల్లులా తీసుకొచ్చేదా అంటూ విమర్శించారు. రాజ్యసభలో బిల్లును గట్టిగా అడ్డుకోవాలని పార్టీ నేత కేశవరావును కేసీఆర్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *