రథం దగ్ధం ఘటనపై సీబీఐ

Share this Page

అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని రథం ఎలా అగ్నికి ఆహుతైందన్న అంశాన్ని తేటతెల్లం చేయాలన్న ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. కేసు దర్యాప్తును ఏపీ పోలీసు సవాలుగా తీసుకున్న తర్వాత కూడా కొన్ని రాజకీయ శక్తులు, బృందాలు… రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని అపోహలను ప్రచారం చేస్తూ, ప్రెస్ మీట్లలోనూ, సోషల్ మీడియాలోనూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలేం జరిగిందో తెల్చేందుకు సీబీఐ విచారణకు ఆదేశించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాల్సిందేనన్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనని రుజువు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో… ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకొంది. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర డీజీపీని ఆదేశించడంతో ఇవాళ ఉత్తర్వులు వెలువడ్డాయ్.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *