చంద్రబాబుకు బీజేపీ బంపర్ ఆఫర్

Share this Page

చంద్రబాబు గారికి చక్కటి అవకాశం… ఆలసించినా ఆశాభంగం… ఇది బీజేపీ నేతలు ఇస్తున్న ఆఫర్… అమరావతి భూ కుంభకోణంలో (insider trading)లో సంబందం లేకుంటే సీబీఐ విచారణ స్వచ్ఛందంగా కోరితే బాగుంటుంది. కడిగిన ముత్యంలా బయటపడొచ్చు. అప్పుడు బాబు గారిమీద ప్రజలకు అనుమానాలు తొలగిపోతాయి. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు… బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కీలక నేత విష్ణు వర్థన్ రెడ్డి. అమరావతి కుంభకోణంలో బాబు గారిమీద… వారి ప్రభుత్వంలోని మంత్రులను ప్రజలు అనుమానిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడుగారు ,లోకేష్ బాబు అమరావతి భూకుంభకోణంలోని ఇన్ సైడర్ ట్రేడింగ్‎లో తనకు సంబంధం లేకుంటే సీబీఐ విచారణ స్వచ్ఛందంగా కోరాలి. కుంభకోణంతో సంబందం లేకుంటే కడిగిన ముత్యంలా బయటపడొచ్చన్నారు విష్ణువర్థన్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *