ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటనల కోసం బోయింగ్ B777 సిద్ధం
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మరియు ప్రధానమంత్రుల పర్యటనల కోసం ప్రత్యేకంగా తయారు చేయసిన బోయింగ్ B777 విమానం ఈ రోజు అమెరికా నుండి భారతదేశానికి రాబోతోంది. విమానాన్ని విమాన తయారీదారు బోయింగ్ ఆగస్టులో ఎయిర్ ఇండియాకు పంపించాల్సి ఉన్నా… సాంకేతిక కారణాల వల్ల డెలివరీ ఆలస్యం అయ్యింది. బోయింగ్ విమానాన్ని ఇండియా తీసుకురావడానికి అధికారులు ఆగస్టులోనే అమెరికా వెళ్లారు. ఎయిర్ ఇండియా వన్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టెక్సాస్ నుండి ఢిల్లీ చేరుకుంటుంది.
వివిఐపిల ప్రయాణానికి మరో బోయింగ్ విమానాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రెండు విమానాల భారత్ కు జూలై నాటికి చేరాల్సి ఉన్నా… కరోనా కారణంగా డెలవరీ ఆలస్యమయ్యింది. వివిఐపిల ప్రయాణ సమయంలో, రెండు బోయింగ్ విమానాలను ఎయిర్ ఇండియా సిబ్బంది కాకుండా భారత వైమానిక దళం పైలట్లు నడుపుతారు. ప్రస్తుతం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ఎయిర్ ఇండియా యొక్క B747 విమానాల ద్వారా ప్రయాణిస్తున్నారు. ఈ విమానం కమర్షియల్ సర్వీసులు సైతం నిర్వహిస్తుంటుంది. ఐతే ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తున్న విమానాలు… వీవీఐపీలకు మాత్రమే వినియోగిస్తారు. B777 విమానాలలో లార్జ్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్మెషర్స్, మరియు సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ తోపాటు, అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలు పనిచేస్తాయి.