ప్రస్తుతానికి జాతీయ పార్టీ ఆలోచన లేదు-కేసీఆర్

Share this Page

కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారంటూ ఇవాళో పత్రికలో ప్రముఖంగా వార్తలు వచ్చాయ్. గత కొంత కాలంగా కేసీఆర్ బీజేపీ విధానాలపై అసహనంగా ఉన్నారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. కరోనాకు ముందు, తర్వాత కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై కేసీఆర్ విమర్శలుగుప్పించారు. రాష్ట్రాలను ఆదుకోవాల్సిన కేంద్రం సరైన పంథా అనుసరించాలేదంటూ ఆయన విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో జరుగుతున్న పరిణామాలపై గుస్సాగా ఉన్న కేసీఆర్… జాతీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని ఇందుకోసం ఆయన మమత బెనర్జీ, హేమంత్ సోరెన్ తో సైతం మాట్లాడరంటూ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతానికి జాతీయ పార్టీ ఆలోచన ఏదీ లేదంటూ కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. సమయం వచ్చినప్పుడు అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అధ్యక్షతరహా ఎన్నికలకు మోదీ అడుగులు వేయబోతున్నారని… ఆ ఎన్నికల్లో కేవలం జాతీయ పార్టీలు మాత్రమే పోటీ చేస్తాయంటూ కూడా వార్తలు వస్తున్నాయ్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్ణయం వెనుక చాలా ఆలోచనలు ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయ్. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ తోపాటు, పలు ప్రాంతీయ పార్టీలు కూడా సుముఖంగా లేవన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *