అతిపెద్ద టీకా తయారీదారు భారత్

Share this Page

కరోనావైరస్ సంక్షోభ సమయంలో భారతదేశం 150 కి పైగా దేశాలకు వైద్య సామాగ్రిని పంపించామన్నారు ప్రధాని మోదీ. ఐక్యరాజ్య సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన మోదీ… అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తయిన తర్వాత సామూహిక వ్యాక్సిన్ పంపిణీతో ప్రపంచాన్ని కరోనావైరస్ సంక్షోభం నుండి బయటకు తీసుకురావడానికి భారతదేశం సహాయపడుతుందన్నారు మోదీ. మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో మరింత కృషి చేయాలని ఐరాసను కోరారు. ప్రపంచంలో అతిపెద్ద టీకా ఉత్పత్తి చేసే దేశంగా, ఈ రోజు ప్రపంచ సమాజానికి మరో హామీ ఇవ్వాలనుకుంటున్నానని… భారతదేశ వ్యాక్సిన్ ఉత్పత్తి మరియు డెలివరీ సామర్థ్యం ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మానవాళికి సహాయపడతామన్నారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌తో భారత్ ముందుకు సాగుతోందన్నారు. భద్రత మరియు సమర్థతను నిర్ణయించడానికి పెద్ద ఎత్తున ట్రయల్స్ చేస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *