సుఖ,దుఃఖాలకు కారణం మానవ సంబంధాలేనా?

Share this Page

సృష్టి ఆరంభం నుంచే మనుషులను ఒక ప్రశ్న కలవరానికి గురిచేస్తుంది. వ్యక్తులతో సంబంధాల వల్ల ఎక్కువ సంతోషం… తక్కువ దుఃఖం ఎలా పొందొచ్చని… లోకంలో మీకున్న అనుబంధాలన్నీ మీకు… సంపూర్ణ సంతోషాలను కలిగిస్తున్నాయా? మనిషి జీవితం అనుబంధాలపైనే ఆధారపడుతుంది. వ్యక్తుల భద్రత కూడా సంబంధాల ఆధారంగానే సాగుతుంది. ఈ కారణంగానే జీవితంలో సుఖసంతోషాలకు… ఆధారం అనుబంధాలే. అలా అయినప్పటికీ అనుబంధాల కారణంగానే… అత్యధికంగా దుఃఖం ఎందుకు కలుగుతుంది? సంఘర్షణలు సైతం అనుబంధాల మూలంగానే ఉత్పన్నమవుతుంటాయ్.

ఎవరైనా ఒక వ్యక్తి … మరో వ్యక్తి ఆలోచనలను గానీ… పనులను గానీ స్వీకరించనప్పుడు ఆ వ్యక్తిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. అప్పుడే సంఘర్షణ మొదలవుతుంది. తిరస్కారం ఎంత ఎక్కువవుతుందో… సంఘర్షణ అంత అధికమవుతుంది. అలాగే ఆమోదం ఎంత ఎక్కువైతే… ఆనందం కూడా అలాగే లభిస్తుంది. ఓ మనిషి స్వయంగా తన అపేక్షలపై అంకుశం పెట్టి తన అంతరంగాన్ని పరిశీలించి ఇంకెవరో వ్యక్తిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మాని… స్వయంగా తనే మారితే… అనుబంధాల మూలంగా సంతోషం పొందడం తేలికవుతుంది. ఆమోదమే మన అనుబంధాలకు నిర్వచనమవుతుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *