రూ.కోటి విలువైన ఎర్రచందనం పట్టివేత

రూ.కోటి విలువైన ఎర్రచందనం పట్టివేత
చంద్రగిరి : చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అటవీశాఖ, ప్రత్యేక కార్యదళం, పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నా ఎర్రచందనం అక్రమ రవాణా మాత్రం ఆగడంలేదు.తాజాగా భాకరాపేట అటవీప్రాంతంలో సుమారు రూ.కోటి విలువ చేసే 29 ఏ-గ్రేడ్‌కు చెందిన ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఎఫ్‌ఆర్‌వో రఘునాథరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భాకరాపేట అటవీప్రాంతంలో అటవీశాఖ అధికారులు మంగళవారం సాయంత్రం నుంచి కూంబింగ్‌ చేపట్టారు. అటవీప్రాంతంలోని పుట్టపాయింట్‌ ఎగువప్రాంతంలో ఎర్ర స్మగ్లర్లు దుంగలను మోసుకొస్తూ అధికారులకు ఎదురుపడ్డారు. దీంతో అప్రమత్తమైన స్మగ్లర్లు దుంగలను చెల్లాచెదురుగా పడేసి చేతికందిన రాళ్లు తీసుకొని అటవీ సిబ్బందిపై దాడి చేస్తూ పారిపోయారు. వారి కోసం అధికారులు గాలింపు చేపట్టారు. సమాచారం అందుకున్న డీఎఫ్‌వో ఫణికుమార్‌ నాయుడు సంఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ దాడిలో అటవీశాఖ అధికారులు నాగరాజు, నందకుమార్‌, జాన్‌, బేస్‌ క్యాంప్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *