చైనాలో తొలి ‘స్మార్ట్‌ ట్రెయిన్‌’

చైనాలో తొలి ‘స్మార్ట్‌ ట్రెయిన్‌’
బీజింగ్‌: ప్రపంచంలోనే తొలి ‘స్మార్ట్‌ ట్రెయిన్‌’గా చెబుతున్న రైలును చైనా ఆవిష్కరించింది. హునాన్‌ ప్రావిన్సులో వారం నుంచి దీన్ని ప్రయోగాత్మకంగా నడుపుతున్నారు. 3.1 కి.మీ.ల మార్గంలో నాలుగు స్టేషన్ల మధ్య ప్రస్తుతం ఇది రాకపోకలు సాగిస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఇది పూర్తి స్థాయిలో సేవలందిస్తుందని.. పూర్తిగా స్వయంచాలితంగా నడుస్తుందని అధికారులు తెలిపారు. పట్టాలకు బదులుగా రహదారులపైన గీసిన తెల్లటి గీతలను అనుసరిస్తూ ఈ స్మార్ట్‌ ట్రెయిన్‌ పరుగులు పెడుతుంది. ట్రామ్‌లు, బస్సుల తరహాలో రహదారులపైనే ఇది నడుస్తుంది. అయితే ట్రాక్‌ అవసరం లేనందున దీన్ని చౌకగా ఏర్పాటు చేయొచ్చు. ఆటోనామస్‌ రైల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌గా పిలుస్తున్న దీనికి మూడు బోగీలు ఉంటాయి. ఒకేసారి 300 మంది ప్రయాణిచేందుకు వీలుంది. అత్యధికంగా గంటకు 70 కి.మీ.ల వేగంతో వెళ్లగలదు. 10 నిమిషాలపాటు ఛార్జ్‌ చేస్తే.. 25 కి.మీ.ల దూరం ప్రయాణించగలదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *