పుట్టినవాళ్లలో సగం మంది వారేనట!

పుట్టినవాళ్లలో సగం మంది వారేనట!
బీజింగ్‌: చైనాలో ‘ఒకే సంతానం’ విధానానికి చెల్లుచీటి పాడిన తర్వాత రెండో సంతానానికి అక్కడ ప్రాధాన్యం పెరిగింది. ఈ ఏడాది (2017) తొలి 8 నెలల్లో జన్మించిన వారిలో సగంమందికి పైగా వారే ఉండడం గమనార్హం. ఈ మేరకు అధికారిక నివేదికలు పేర్కొంటున్నాయి.

దేశంలో కార్మిక శక్తిని పెంచేందుకు దశాబ్దాలుగా వస్తున్న ‘ఒకే బిడ్డ’ విధానానికి గతేడాది చైనా చరమగీతం పాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు జన్మించిన కోటీ 16 లక్షల మంది (11.6మిలియన్స్‌)లో 52 శాతం రెండో సంతానంగా జన్మించారని చైనా ఆరోగ్య, కుటుంబ నియంత్రణ కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఎఫ్‌పీసీ) తెలిపింది.

40 ఏళ్లుగా వస్తున్న ‘ఒకే సంతానం’ విధానాన్ని సడలించిన ఏడాది (2016) 1.85 కోట్ల మంది ఆస్పత్రుల్లో జన్మించారని కమిషన్‌ పేర్కొంది. ఇందులో 45 శాతం మంది రెండో సంతానం. నిబంధనలు సడలించిన తర్వాత అదే ఏడాది చిన్నపిల్లల ఆసుపత్రులు, ప్రసూతి ఆసుపత్రుల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *