హాలోవీన్‌ వేడుకల్లో పాల్గొన్న క్రికెటర్‌

హాలోవీన్‌ వేడుకల్లో పాల్గొన్న క్రికెటర్‌
దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ‘హాలోవీన్‌’ వేడుకలు సందడిగా జరుగుతున్నాయి. చిత్రవిచిత్ర వేషధారణలతో భయపెట్టేలా పిల్లలు, పెద్దలు రెడీ అవుతున్నారు. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్‌ భామ శిల్పాశెట్టి తన నివాసంలో ‘హలోవీన్‌’ వేడుకలను నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్టోబరు 31న ‘హాలోవీన్‌’ డేను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

తాజాగా భారత క్రికెటర్‌ సురేశ్‌ రైనా ఈ వేడుకల్లో పాల్గొన్నాడు. దిల్లీలోని వసంత్‌ విహార్‌లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న రైనా ఇందుకు సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘హ్యాపీ.. స్కేరీ హాలోవీన్‌’ అని రైనా పేర్కొన్నాడు.

మరో క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ తన కుమార్తె రియా ‘హాలోవీన్‌’ వేడుకల్లో పాల్గొన్న ఫొటోను పంచుకున్నాడు. ‘అందరికీ హాలోవీన్‌ శుభాకాంక్షలు. నా కుమార్తె రియా తానే సొంతంగా ఈ కాస్ట్యూమ్‌ను సిద్ధం చేసుకుంది. ఆమె సృజనాత్మకత, ప్రతిభ చూసి నాకెంతో గర్వంగా ఉంది.’ అని ధావన్‌ పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *