కోహ్లీ రెస్టారెంట్‌లో టీమిండియా సందడి

కోహ్లీ రెస్టారెంట్‌లో టీమిండియా సందడి
దిల్లీ: భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ దేశ రాజధాని దిల్లీలో ఓ రెస్టారెంట్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే కదా. కివీస్‌తో టీ20 సిరీస్‌ కోసం ప్రస్తుతం కోహ్లీ సేన దిల్లీలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా మంగళవారం రాత్రి కోహ్లీకి చెందిన ‘నుయేవా రెస్టారెంట్‌’లో సందడి చేశారు.

ఈ ఫొటోలను ఆటగాళ్లు సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. రెస్టారెంట్‌లోని ఆహారం, సర్వీసు చాలా బాగున్నాయని ధావన్‌ పేర్కొన్నాడు. ఈ రెస్టారెంట్‌కు వచ్చినవారు తప్పకుండా కోల్డ్‌ పిజ్జా ట్రై చేయండి అని అక్షర్‌ పటేల్‌ కోరాడు. హోటల్‌ సిబ్బందితో కలిసి ఆటగాళ్లు ఫొటోలు దిగుతూ సందడి చేశారు.

టీ20 సిరీస్‌లో భాగంగా ఈ రోజు రాత్రి ఏడు గంటలకు భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. దిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *