మనాలిలో విహరిస్తున్న మెగా హీరోలు

మనాలిలో విహరిస్తున్న మెగా హీరోలు
హైదరాబాద్‌: సినిమా షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్న మెగా హీరోలు ప్రస్తుతం మనాలిలో విహరిస్తున్నారు. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌ తదితర కుటుంబ సభ్యులు విహారయాత్ర కోసం మనాలి వెళ్లారు. అక్కడి మంచు కొండలు, సెలయేళ్ల ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. మనాలికి 51 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతిపెద్ద పర్వతం రోహ్‌తంగ్‌ని కూడా వీరు సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ తీసిన ఫొటోలను అల్లు శిరీష్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

ఈ ఫొటోల్లో అల్లు అర్జున్‌ దంపతులు, రామ్‌చరణ్‌, అల్లు శిరీష్‌ కనిపించారు. ప్రస్తుతం ఇవి సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. ట్రిప్‌లో దిగిన ఫొటోలను సోమవారం ఉపాసన ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్‌ జడలబర్రెపై కూర్చొని కనిపించారు.

చెర్రీ ప్రస్తుతం ‘రంగస్థలం 1985’లో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూరుస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. బన్ని ప్రస్తుతం ‘నాపేరు సూర్య- నాఇల్లు ఇండియా’ చిత్రంలో నటిస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకుడు. అను ఇమ్మాన్యుయెల్‌ కథానాయిక. విశాల్‌-శేఖర్‌ స్వరాలు అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *